సీఎం కేసీఆర్ అన్న కూతురు అరెస్ట్...

 

తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు సోదరుడి(అన్న) కూతురు.. రమ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. చొప్పదండి టిఆర్ఎస్ ఎమ్మెల్యే బొడిగ శోభ అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ.. గన్‌‌పార్క్‌ రమ్య ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈనేపథ్యంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కాగా రమ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.