కాంట్రాక్ట్ ఉద్యోగులకు కేసీఆర్ శుభవార్త..
Published on: Thu Dec 31, 2015 3:50PM

తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే జనవరి 2 లోగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి వివరాలు అందజేయాలని..ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. దీనితో పాటు ఔట్ సార్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలని.. డీఎస్సీ నోటీఫికేన్ విడుదల చేయాలని ఆదేశించారు. కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ వల్ల 15 నుండి 20వేల పోస్టులు భర్తీ అవుతాయి. అంతేకాదు పోలీస్ శాఖకు సంబంధించిన 9 వేల కానిస్టేబుళ్ల పోస్తుల భర్తీకి కూడా వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని కేసీఆర్ అదేశించినట్టు తెలుస్తోంది.


