TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ యాగంపై డిగ్గీ కామెంట్లు..

Published on: Wed Dec 23, 2015 10:49AM

తెలంగాణ సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలోని తన ఫాం హౌస్ లో నిర్వహిస్తున్న ఆయుత చండీయాగం ఘనంగా ప్రారంభమైంది. అయితే ఇప్పుడు కేసీఆర్ ప్రారంభించిన ఆయుత చండీయాగంపై దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకపక్క తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇప్పుడు ఈ యాగాలేంటి అని ప్రశ్నించారు. అంతేకాదు కేసీఆర్ ఈ యాగాన్ని తన సొంత ఖర్చుతో నిర్వహిస్తున్నాని అంటున్నారు.. దానికి నిధులు ఎక్కడినుండి వచ్చాయో చెప్పాలని ట్విట్లర్లో ట్వీట్స్ పోస్ట్ చేశారు. మరి డిగ్గీ కామెంట్స్ కి కేసీఆర్ ఎలా సమాధానం చెబుతారో చూడాలి.