TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఘనంగా ప్రారంభమైన కేసీఆర్ ఆయుత చండీయాగం..

Published on: Wed Dec 23, 2015 9:13AM


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆయుత చండీయాగం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. మెదక్ జిల్లాలోని తన ఫాంహౌస్ లో కేసీఆర్ తలపెట్టిన యాగం.. గురుప్రార్ధనలతో ప్రారంభమైంది. తొలుత రుత్విజులతో కలిసి సీఎం కేసీఆర్‌ దంపతులు యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. మొత్తం యాగం కోసం దేశ వ్యాప్తంగా నలుమూలల నుంచి రెండు వేల మంది రుత్విజులు వచ్చినట్టు తెలుస్తోంది. ఐదు రోజులు జరిగే ఈ చండీయాగంలో కోటి సవార్ణ మంత్రాలు, ఉదయం పూట సప్తశతి మంత్రజపాలు.. సాయంత్రం పూట సవార్ణ మంత్ర జపాలు జరుగుతాయి. 108 హోమగుండాలతో పాటు చతుర్వేద యాగశాలల్లో రాజశ్యామల, మహారుద్ర, అయుత మహా చండీయాగం జరగుతుంది. అయుత మహా చండీయాగంలో భాగంగా మొదటిరోజైన ఈరోజు వెయ్యి చండీ పారాయణాలు, 40లక్షల నవార్ణమంత్ర జపాలు చేస్తారు. చండీయాగం ప్రారంభోత్స సందర్భంగా తొలిరోజున జరిగే క్రతువులో కేసీఆర్‌తో పాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు.

మరోవైపు యాగశాల చుట్టూ 5కిలో మీటర్ల మేర సీసీ కెమెరాలు ఏర్పాటు..3,300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.