TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పూర్తిస్థాయి డీజీపీగా అనురాగ్ శర్మ

Published on: Fri Nov 13, 2015 4:16PM


ఇప్పటి వరకు తాత్కాలిక డీజీపీ బాధ్యతలు నిర్వర్తించిన అనురాగ్ శర్మ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పూర్తిస్థాయి డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్)గా నియమితులయ్యారు. అనురాగ్ శర్మను పూర్తిస్థాయి డీజీపీ గా నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అనురాగ్ శర్మతో పాటు మరో నలుగురు పూర్తి స్థాయి డీజీపీ రేసులో ఉన్నారు. కాగా అనురాగ్ శర్మను పూర్తిస్థాయి డిజిపిగా నిర్ణయించినందున ఆయనకు పలువురు అధికారులు ఫోన్ చేసి అభినందనలు తెలుపుతున్నారు. అనురాగ్ శర్మ..సీఎం కేసీఆర్ ను సచివాలయంలో స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.