జయలలిత కు ఎక్మో ద్వారా వైద్యం... ఎక్మో అంటే ఏమిటి..?


జయలలిత ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి బృందం హెల్త్ బులెటిన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జయ ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని... జయకు ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నామని.. జయ ఎప్పుడు కోలుకుంటారో చెప్పలేమని తెలిపారు వైద్య బృందం. అసలు ఈ ఎక్మో ఏంటి... ఎక్మో చికిత్స ఏంటో చూద్దాం ఒకసారి. ఎక్మో అంటే ఎక్స్‌ట్రాకార్పోరియ‌ల్ మెంబ్రేన్ ఆక్సిజ‌నేష‌న్‌. అసలు దీనిని ఎందుకు ఉపయోగిస్తారంటే.. గుండెపోటు వ‌చ్చినా, శ్వాస సంబంధ ప్ర‌క్రియ‌లు నిలిచిపోయినా ఈ పరికరాన్ని ఉపయోగిస్తారు. సాధార‌ణంగా ఎక్మోను చివ‌రి అస్త్రంగా భావిస్తారు. సాధార‌ణ చికిత్సా ప‌ద్ధ‌తుల‌కు రోగి స్పందించ‌ని క్ర‌మంలో ఎక్మో మెషీన్‌తో చికిత్స‌ను అందిస్తారు.సిరల(వీన్స్‌) నుంచి ఎక్మో మెషీన్ ర‌క్తాన్నీ పీలుస్తుంది. ఆ ర‌క్తానికి ఆక్సిజ‌న్ జోడించి, అందులో నుంచి కార్బ‌న్‌డైయాక్సైడ్‌ను తొలిగిస్తుంది. ఇదే ప్ర‌క్రియ‌లో ర‌క్తాన్ని ఎక్మో మెషీన్ కొంత వేచ్చ‌గా కూడా మారుస్తుంది. ఆ త‌ర్వాత ఎక్మో మెషీన్ ర‌క్తాన్ని ధ‌మ‌నులు(ఆర్ట‌రీ)ల‌కు పంప్ చేస్తుంది. అంతే కాదు, మొత్తం శ‌రీరం కుండా రక్తం ప్ర‌వ‌హించేలా ఆ మెషీన్ చేస్తుంది. మరి లాస్ట్ స్టేజ్ లో ఈ పద్దతిని ఉపయోగించే నేపథ్యంలో జయ ఆరోగ్యం విషమంగానే ఉన్నట్టు అర్ధమవుతోంది. మరి ఈ గండం నుండి ఆమె గట్టెక్కి ఆరోగ్యంతో బయటపడతారో లేదో చూద్దాం..