TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డీఎంకేలో జయలలిత చిచ్చు..

Published on: Fri Jun 24, 2016 11:34AM

 

తమిళనాడు సీఎంగా రెండో సారి అధికారం చేపట్టి రికార్డులు జయలలిత రికార్డులు బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఈసారి అధికారం చేపట్టేది డీఎంకే పార్టీనే అని ఎన్ని సర్వేలు వచ్చినా.. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ అమ్మ మరోసారి అధికారం చేపట్టారు. అలా అధికారం చేపట్టారో లేదో  తన ప్రత్యర్ధి అయిన కరుణానిధిపై అప్పుడే తన విమర్శల బాణాలు వదులుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆమె డీఎంకే పార్టీ అధినేత కరుణానిదినా?.. లేక ఆయన కుమారుడు స్టాలినా..? అని తెలియని గందరగోళంలో పార్టీ ఉందని.. సెటైర్లు పేల్చారు. దీనిపై కరుణానిధి అసెంబ్లీకి వచ్చి తనకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మరి అమ్మ కామెంట్లకు డీఎంకే పార్టీ నేతలు ఊరుకుంటారా. పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ నిరసన తెలిపారు. దానికి మరోసారి జయలలిత ఫైర్ అయి తన విమర్శలపై సమాధానం ఇచ్చే దమ్ము,ధైర్యం కరుణానిధికి లేవంటూ మరోసారి రెచ్చిపోయారు. దమ్ముంటే డీఎంకే ఎమ్మెల్యేలు కరుణానిధిని అసెంబ్లీకి తీసుకురావాలని సవాల్ చేశారు. డీఎంకేలో తండ్రీ కొడుకుల మధ్య గ్రూపు రాజకీయాలున్నాయని జయలలిత విమర్శించారు.

 

ఇదిలా ఉండగా జయలలిత చేసిన విమర్శలు ఆ పార్టీలో కొత్త దుమారమే రేపేలా కనిపిస్తోంది. ఎన్నో ఏళ్ల నుండి ప్రతిపక్షనేతగా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు కరుణానిధి. అయితే కరుణానిధి ఉన్నా.. ప్రస్తుతం ఆయన కొడుకు స్టాలిన్ పక్షానికి నాయకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కరుణానిధి మాట్లాడుతూ.. తాను బ్రతికి ఉన్నంత కాలం ఒకవేళ సీఎంగా గెలిస్తే తానే సీఎం పదవిని చేపడతానని.. తాను పోయిన తరవాతనే తన కొడుకులు సీఎం పదవి చేపడతారని చెప్పారు. కానీ సీఎం పదవి ఎలాగూ దక్కలేదు. ఇక ప్రతిపక్ష నేతగా ఉండాల్సిందే. కొంత కాలంగా వీల్ చైర్ కే పరిమితమైన కరుణానిధి అసెంబ్లీకి కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఇక పరోక్షంగా ఆ బాధ్యతలు స్టాలిన్ చేపట్టాడు.

 

అయితే కొంత కాలంగా స్టాలిన్, కరుణానిధిల మధ్య కూడా దీనిపై గొడవలు జరుగుతున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ బాధ్యతలు పూర్తిగా తనకే ఇవ్వాలని చూస్తున్నారంట స్టాలిన్. ఇప్పుడు జయలలిత చేసిన వ్యాఖ్యల వల్ల మరింత చిచ్చు రేగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో అయినా కరుణానిధి పూర్తి బాధ్యతలు స్టాలిన్ కు అప్పగించి దిగిపోతారో.. లేక అలానే కొనసాగుతారో.. చూడాలి.