చిదంబరం హోంశాఖ పదవికి రాజీనామా చేయాలి: జయ
Published on: Thu Jun 7, 2012 3:29PM
కేంద్ర హోంశాఖ పదవికి చిదంబరం రాజీనామా చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిమాండ్ చేసింది. మద్రాస్ హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకున్న చిదంబరం కేంద్ర హోంశాఖ పదవి నుంచి వైదొలకపోతే మంత్రివర్గం నుంచి ఆయనను ప్రధాని తప్పించాలన్నారు. చిదంబరం మంత్రివర్గంలో కొనసాగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఆయన మోసపూరితంగా గెలిచారని తాము ముందునుంచి వాదిస్తున్నామని జయలలిత తెలిపారు. 2009 ఎన్నికలలో శివగంగ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చిదంబరం అన్నాడీఎంకే అభ్యర్థి ఆర్ఎస్ రాజా కన్నప్పన్ పై 3354 ఓట్ల స్వల్పమెజారిటీతో గెలిచారు. చిదంబరం ఎన్నికను సవాల్ చేస్తూ కన్నప్పన్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై చిదంబరం వేసిన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు గురువారం తిరస్కరించింది.


