TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కారు వ‌ద్దు హెలికాప్ట‌రే ముద్దు!.. ఆకాశంలో జగనన్న‌ చ‌క్క‌ర్లు..!

Published on: Thu Jan 13, 2022 1:51PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిలో ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం.. తన వద్ద ఉన్న నిధులను చాలా జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిధుల వినియోగం విషయంలో దుబారా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్ అడుగు బయటపెడితే చాలు.. హెలికాప్టర్‌ మాత్రమే వాడుతున్నారనే విమర్శలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ప్రయాణ దూరం, ప్రయాణానికి పట్టే సమయాన్ని సీఎం జగన్.. ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా.. సమీప ప్రాంతాలకు సైతం సీఎం జగన్ హెలికాప్టర్‌ను వినియోగిస్తున్నారని నెట్ జన్లు విమర్శిస్తున్నారు. కొత్త ఏడాది పురస్కరించుకుని.. గుంటూరు జిల్లా పెదనందిపాడులో పెన్షన్ల పెంపు పథకం సీఎం జగన్ ప్రారంభించారు. అయితే తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి పెదనందిపాడుకు దూరం 50 కిలోమీటర్ల లోపే ఉంటుంది. 

ముఖ్యమంత్రి వస్తున్నారంటే.. రూట్ క్లియర్ చేస్తే.. ఆరగంటలో తన కాన్వాయితో సహా సీఎం జగన్ పెదనందిపాడు చేరుకుంటారు. కానీ సీఎం జగన్ మాత్రం హెలికాప్టర్‌లో పెదనందిపాడు వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే జనవరి 12వ తేదీ గుంటూరులో ఐటీసీ హోటల్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. 

తాడేపల్లికి గుంటూరుకి మధ్య దూరం 30 కిలోమీటర్లలోపే ఉంటుంది. సీఎం జగన్ ప్రయాణానికి మహా అయితే అరగంట కూడా పట్టదు. అదీకాక ఇది జాతీయ రహదారి.. ఈ నేపథ్యంలో పదే పది నిమిషాల్లో సీఎం జగన్ తన కాన్వాయితో సహా గుంటూరు చేరుకోవచ్చు. కానీ ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హెలికాప్టర్‌లో అలా వెళ్లి.. ఇలా మళ్లీ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. పక్కనే ఉన్న గుంటూరుకు కూడా సీఎం జగన్ హెలికాప్టర్ వాడతారా? అని గుంటూరు నగర ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. సీఎం జగన్ ఇలా హెలికాప్టర్ ప్రయాణాలు ఏమిటని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత తక్కువ దూరానికి కూడా ముఖ్యమంత్రి హెలికాప్టర్ వాడడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అయితే, రోడ్డు మార్గాన వెళ్తుంటే.. జ‌గ‌న్ ఎక్క‌డ క‌నిపిస్తే అక్క‌డ ప్ర‌జ‌లు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తుండ‌టం.. జ‌నం నుంచి జ‌గ‌న్‌ను ర‌క్షించ‌డానికే.. ఇలా దొంగ‌చాటుగా ఆకాశ మార్గాన హెలికాప్ట‌ర్‌లో వెళ్తున్నార‌నే వాళ్లూ లేక‌పోలేదు. అస‌లు రీజ‌న్ ఏదైనా.. మ‌రీ 30 కి.మీ. దూరానికి కూడా జ‌గ‌న‌న్న హెలికాప్ట‌ర్ వాడ‌టం అస‌లేం బాలేదంటున్నారు ప్ర‌జ‌లు.