TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

స్వరూపానందస్వామిని కలవనున్న జగన్‌.. కారణం?

Published on: Mon Jun 3, 2019 12:34PM

 

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామిని ప్రత్యేకంగా కలవాలని ఏపీ సీఎం  వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ నెల 4వ తేదీన జగన్‌ విశాఖ పర్యటన ఖరారైందని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. రేపు సీఎం విశాఖ చేరుకొని స్వరూపానంద స్వామిని ప్రత్యేకంగా కలవనున్నారు. అనంతరం తిరిగి అమరావతి చేరుకోనున్నారు.

మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్న జగన్.. ముహూర్తంపై స్వరూపానంద సలహాలు, సూచనలు తీసుకోనున్నారని తెలుస్తోంది. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత జగన్, స్వరూపానందను కలవలేదు. జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని కూడా స్వరూపానంద పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేయాలని జగన్ నిర్ణయించుకున్నారు.