TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగనన్న ఉన్నాడు జాగ్రత్త.. లేదంటే అంతేమరి! రోడ్లపై ఫ్లెక్సీల కలకలం..

Published on: Sun Dec 12, 2021 11:04AM

ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు గురించి ఎంత చెప్పుకుంటే అంత మంచిదేమో. అంత దారుణంగా తయారయ్యాయి రోడ్లు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుంతల రోడ్లే. ఏదో పల్లెటూరు రోడ్లు కాదు... రాష్ట్ర రహదారుల పరిస్థితి కూడా అంతే. అడుగుతో గుంతతో వాహనదారులు నరకం చూస్తున్నారు. అధ్వాన్యంగా మారిన రోడ్లతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏపీలో దారుణంగా దెబ్బతిన్న రహదారుల విషయంలో రెండేళ్లుగా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా ముందుకెళ్లింది. రోడ్ల అభివృద్ధికి పెట్రోల్‌పై రెండేళ్లుగా లీటరుకు రూ.2 రూపాయల చొప్పన సెస్‌ వసూలు చేస్తున్నా దాంతో రోడ్లను రిపేర్లు కూడా చేయించలేని దుస్ధితి. 

ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో రోడ్లు చాలా వరకు అధ్వానంగా మారాయి. ఎక్కడ రోడ్డుందో.. ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రజలు ఎంత గగ్గోలు పెడుతున్నా జగన్ సర్కారు మాత్రం రోడ్ల బాగు గురించి సరిగ్గా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో గోదావరి జిల్లాల ప్రజలు జగన్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే తమ వెటకారంతో జగన్ సర్కారుకు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని ఓ రోడ్డుపై పెట్టిన బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 ‘జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త.. రోడ్డు వేసే వరకు ఎవరైనా ఈ బోర్డును తొలగిస్తే వారి కుటుంబం ఈ రోడ్డుపైనే పోతుంది’ అనేలా జగన్ ఫొటోలతో ఫ్లెక్సీ చేయించి బోర్డు పెట్టారు. ఈ ఫొటోలను జనసేన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసి ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు.