సీఎం జగన్ కు గాయం..హాస్పిటల్ లో చికిత్స! గెట్ వెల్ సూన్..
Published on: Fri Nov 12, 2021 11:29AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాయమైంది. ఆయన కుడి కాలుకు గాయం కావడంతో.. ఆయన చికిత్స కోసం తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ కు వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు ఆయన అక్కడే ఉన్నారు. ఆసుపత్రిలోని ప్రత్యేక విశ్రాంతి గదిలో సీఎం జగన్‌కు చికిత్స నిర్వహించారు డాక్టర్లు. చికిత్స ముగిసిన తర్వాత మణిపాల్ ఆసుపత్రి నుంచి ఆయన తన నివాసానికి వెళ్లిపోయారు. అయితే సీఎం జగన్ కు కాలుకు గాయం ఎలా అయిందన్న విషయంలో మాత్రం తెలియరాలేదు.
మరోవైపు సీఎం జగన్ కుడి కాలుకు గాయం జరిగిందన్న విషయంలో తెలియడంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యమంత్రి మణిపాల్ హాస్పిటల్ కు వెళ్లారని తెలియడంతో కొందరు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు హాస్పిటల్ దగ్గరుక ఎవరినీ రానీయలేదని తెలుస్తోంది.


