TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

పంచాయతీ ఎన్నికలలో జగన్ బావమరిది దౌర్జన్యం

Published on: Mon Feb 8, 2021 3:57PM

ఎపి పంచాయతీ ఎన్నికలలో బెదిరింపులు, కిడ్నాపులు చేయడం ద్వారా బలవంతపు ఏకగ్రీవాలు సాధించే పనిలో అధికార వైసిపి నేతలు బిజీగా ఉన్నారు. ఒక పక్క ఎస్‌ఈసీ హెచ్చరిస్తున్నా వైసిపి నేతలు ఏమాత్రం లెక్క చేయకుండా తమ పరిధిలో ఏకగ్రీవాల కోసం విశ్వప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా దీనికోసం వీరు గ్రామ వాలంటీర్లను కూడా పావులుగా వాడుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నాటకాకుండా తమకు ఓటేస్తే.. అర్హత లేకున్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని ఓటర్లకు గాలం వేస్తున్నారు. 

తాజాగా కృష్ణా జిల్లా పంచాయతీ ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ బావమరిది యువరాజ్‌రెడ్డి రంగంలోకి దిగారు . అయన వ్యవహారంతో మైలవరం మండలం గణపవరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 100 మంది కార్యకర్తలతో యువరాజ్‌రెడ్డి అక్కడ ప్రచారం చేశారు. అయితే రేపు ఎన్నికలు పెట్టుకుని ఎలా ప్రచారం చేస్తారని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఈ ప్రచారాన్ని వీడియోలు తీస్తున్న టీడీపీ నేతలతో యువరాజ్‌రెడ్డి గొడవకు దిగారు. అంతేకాకుండా అయన బూతులు తిడుతూ ఫోన్లు లాక్కొని టీడీపీ శ్రేణులపై దౌర్జన్యం కూడా చేశారు.