TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వీరయ్య కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ..హంతకులను వదిలే ప్రసక్తే లేదు

Published on: Wed Apr 23, 2025 7:32PM

 

నిన్న ఒంగోలులో  హత్య గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి భౌతికకాయానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒంగోలులో టీడీపీ కార్యకర్త  వీరయ్య చౌదరి మంగళవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలుకు చేరుకున్న ముఖ్యమంత్రి.. వీరయ్య చౌదరి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు అనిత, ఆనం, డోలా, ఎంపీ మాగుంట, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఇలాంటి ఘోరం జరగడం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. బాధ్యులను పట్టుకొని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేర రాజకీయాలు చేసేవారిని ఉపేక్షించమని స్పష్టం చేశారు.  

హత్య జరిగిన నాటి నుంచే ప్రభుత్వం అన్ని కోణాల్లో దర్యాప్తును ప్రారంభించిందని ముఖ్యమంత్రి తెలిపారు. “ఈ కేసు దర్యాప్తుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. సీసీటీవీ ఫుటేజ్, క్లూస్ అన్నింటినీ పరిశీలిస్తున్నామన్నారు. 53 కత్తిపోట్లు ఉన్నట్టు నివేదికల్లో ఉంది. ఇది కరుడు కట్టిన నేరగాళ్ల పన్నుగట్టిన కుట్ర,” అని చెప్పారు. ప్రజల్లో ఎవరికైనా ఈ హత్యకు సంబంధించి సమాచారం ఉంటే, టోల్ ఫ్రీ నంబర్ 9121104784 కు ఫోన్ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. హత్య చేసిన నేరగాళ్లు భూమిపై ఎక్కడ దాక్కున్నా వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులు చివరకు కాలగర్భంలో కలిసిపోతారు. నేర రాజకీయాలను తుదముట్టించే వరకు పోరాటం చేస్తాం. రాష్ట్రం నేరస్థుల అడ్డాగా మారకూడదు అని చంద్రబాబు అన్నారు.