TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈవీలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు సమీక్ష

Published on: Mon May 18, 2026 9:33PM

 

ఇంధన పొదుపు కోసం చేపట్టే కార్యాచరణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఉద్యమంగా మార్చేలా ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈవీ సైకిళ్లు, ఈవీ వాహనాల ను పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి  ఈవీ కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. 

రాష్ట్రంలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాలకు ఎలక్ట్రిక్ సైకిళ్లు అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. మొత్తం 16 వేల ఎలక్ట్రిక్ సైకిళ్లను ఆ కార్యాలయాల సిబ్బందికి అందించాలని సీఎం నిర్దేశించారు.
ఈవీ వాహనాలను సులభంగా కొనుగోలు చేసేలా రుణాలను అందించే ప్రయత్నం చేయాలని.. దీని కోసం ఓ ప్రత్యేక ఎస్పీవీని ఏర్పాటు చేయాలని  స్పష్టం చేశారు. ఈఎంఐ విధానంలో ఈవీ సైకిళ్లను ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ఛార్జింగ్ స్టేషన్ల లాంటి మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. ఛార్జింగ్ స్టేషన్లతో పాటు మౌలికసదుపాయాల కల్పించటంపై ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం పేర్కొన్నారు.