ఆపరేషన్ ఆకర్ష్ 2 .. టీడీపీలోకి పలువురు సీనియర్లు
Published on: Sat Aug 25, 2018 1:14PM
2014 ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత పలువురు నేతలు టీడీపీలో చేరారు.. ముఖ్యంగా ఎన్నికల తరువాత పలువురు వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.. అయితే ఎన్నికల సమయం సమీపిస్తున్న వేల మరొక్కసారి టీడీపీ అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.. అయితే ఈ సారి లిస్ట్ లో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.. విభజన పుణ్యమా అని ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది.. విభజన అనంతరం మెజారిటీ నాయకులు కాంగ్రెస్ ని వీడి ఇతర పార్టీలలో చేరారు.. అతి కొద్దిమంది నేతలు మాత్రమే కాంగ్రెస్ ని అంటిపెట్టుకొని ఉన్నారు.. ఇక కొందరు నేతలైతే అసలు రాజకీయాలకే దూరంగా ఉన్నారు.

అయితే స్థానికంగా మంచి పేరు, పలుకుబడి ఉండి పార్టీకి ఉపయోగపడతారు అనుకునే నేతలను టీడీపీ తమ పార్టీలోకి ఆహ్వానించాలని చూస్తుందట.. ఇప్పటికే ఆ దిశగా వ్యూహాలు కూడా రచిస్తోన్నట్టు తెలుస్తోంది... టీడీపీ చేపట్టనున్న ఆపరేషన్ ఆకర్ష్ 2 లో పలువురు సీనియర్లు ఉన్నట్టు సమాచారం.. ఉగ్ర నరసింహారెడ్డి, కొండ్రు మురళితో పాటు విశాఖ నుంచి సబ్బం హరి, కొణతాల రామకృష్ణ ఉన్నట్టు తెలుస్తోంది.. హరికి నార్త్ ఎమ్మెల్యే సీట్, కొణతాలకు అనకాపల్లి ఎంపీ సీట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.. అలాగే తూర్పు గోదావరి జిల్లా నుంచి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కి రాజమండ్రి ఎంపీ లేదా ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.. అదేవిధంగా రాయలసీమకు చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా ఆపరేషన్ ఆకర్ష్ 2 లిస్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది.


