TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మరో అడుగు ముందుకేసిన బాబు... ఆసియాలోనే అతిపెద్దది..

Published on: Mon Nov 27, 2017 11:38AM

 

టెక్నాలజీని వాడుకోవడంలో చంద్రబాబు తోపు అన్న సంగతి అందరికీ తెలిసిందే కదా. కొత్త కొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతుంటారు. తాజాగా మరోసారి అలాంటి ప్రయోగం చేశారు చంద్రబాబు. అదేంటంటే.... ఆసియాలోనే అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్ రూమ్ ఏర్పాటు చేశారు.  RTGS ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తారన్న సంగతి విదితమే కదా. అయితే వీడియో కాన్ఫెరెన్స్ లకు అధికారులు ఎక్కడ ఉన్నా సరే పాల్గొనాల్సి వస్తుంది. కానీ చంద్రబాబు తీసుకొచ్చిన అత్యాధునిక వ్యవస్థ ద్వారా...  సీఎం వీడియో కాన్ఫరెన్స్ కోసం ప్రత్యేకంగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వచ్చే అవసరం ఉండదు. తాము వున్న ప్రాంతం నుంచే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనవచ్చు. ఒక్క సెల్ ఫోన్ ఉంటే …దానికి సిగ్నల్ ఉంటే చాలు …ఎక్కడ నుంచి అయినా సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు.

 

అంతేకాదు ఈ వ్యవస్థలో ఇంకో గొప్ప విషయం కూడా ఉంది.. అదేంటంటే... సీఎం ఈ కేంద్రం నుంచి సర్వే లెన్స్ కెమెరాల ద్వారా రాష్ట్రం మొత్తాన్ని నేరుగా చూడొచ్చు. ఇందుకోసం ఇప్పటికే 5 వేల కెమెరాలు ఏర్పాటు చేశారు. త్వరలో మరో 15 వేల కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురు అయినప్పుడు సీఎం సహా సంబంధిత అధికార వర్గం ఏ ప్రాంతంలో పని చేస్తున్న అధికారులతో అయినా నేరుగా చూస్తూ ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికి చంద్రబాబు ఈ వ్యవస్ధను తీసుకొచ్చి అందరికంటే మరో ముందుడుగు వేశారు. ఒకే ఒక్కడు సినిమాలో మాదిరిగా.... ఆన్ ది స్పాట్ పని చేయించడానికి రెడీ ఆయ్యారు.