ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు..
Published on: Wed Mar 22, 2017 5:14PM
.jpg)
ఆంధ్రప్రదేశ మంత్రివర్గ విస్తరణకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూహుర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఉగాది పర్వదినం రోజున మంత్రివర్గం విస్తరణ చేపట్టాలని చంద్రబాబు అనుకున్నారు.. కానీ ముహూర్తాన్ని వాయిదా వేసుకున్నారు. ఏప్రిల్ 6వ తేదీన మంత్రివర్గం విస్తరణ చేయనున్నారు. అయితే ఈసారి మంత్రి వర్గ స్థానంలో లోకేశ్ కు స్థానం ఉండొచ్చు అని అంటున్నారు. కాగా ఇటీవలే లోకేశ్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రస్తుతం పదవీ విరమణ చేయాల్సిన ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29 వరకు ఉండటంతో వారు అప్పటివరకూ ఎమ్మెల్సీసుగానే కొనసాగుతారు. వారి పదవీకాలం పూర్తయిన తర్వాత మాత్రమే.. లోకేశ్, ఆయనతో పాటు ఎన్నికైన మిగతా సభ్యులు ఎమ్మెల్సీలవుతారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయకున్నా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉంది.
ఏప్రిల్ 6వ తేదీన నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం లోకేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. లోకేశ్‌తో పాటు మరి కొంతమందిని కొత్తగా కేబినెట్‌లోకి చేర్చుకోనుండగా, కొంత మందికి ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. మొత్తంమీద లోకేశ్ కోరికను ఏప్రిల్ ఆరో తేదీన చంద్రబాబు పూర్తి చేయనున్నారు.


