TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బుల్లెట్ బైక్‌పై చంద్రన్న మాస్ రాజసం!

Published on: Sat May 16, 2026 6:33PM

 

ఏం వైబ్రేషన్ ఉంది సామీ "నువ్వు ఉండవయ్యా నేను ఎప్పుడో బుల్లెట్ నడిపా" అంటూ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుల్లెట్ ఎక్కి హెల్మెట్ పెట్టుకుంటే.. ఆ దర్పం, ఆ రాజసం చూసి అభిమానుల గుండెల్లో పూనకాలు వచ్చాయి. నాడు యువకుడిగా బుల్లెట్ బైక్ నడిపిన ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ఆయన చూపిన ఆ గంభీర ముద్ర సోషల్ మీడియాను ఊపేస్తోంది. 

ఆనాడు తానే స్వయంగా బుల్లెట్ నడిపిన మన పెద్దాయన.. నేడు అదే రాయలసీమ గడ్డపైకి ఏకంగా 'రాయల్ ఎన్ఫీల్డ్' పరిశ్రమనే తీసుకొచ్చి వేలాది మంది యువతకు ఉపాధి కల్పించి, సీమకు అసలైన 'రాయల్' దర్పం తెచ్చిన అపర చాణక్యుడు. వయసు కేవలం నంబర్ మాత్రమేనని, విజన్ ఉన్న నేత ఎప్పటికీ నవ యువకుడేనని ఈ స్ఫూర్తిదాయక దృశ్యం మరోసారి నిరూపించింది.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ‘స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసులు ఏర్పాటు చేసిన ‘హెల్మెట్ బ్యాంక్‌’ను సందర్శించారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పోలీసులను అభినందించారు. అనంతరం స్వయంగా హెల్మెట్ పెట్టుకుని బైక్‌పై కూర్చుని యువతకు ఆదర్శంగా నిలిచారు.