వైసీపీ పాలనలో ఏపీ బ్రాండ్ దెబ్బతిన్నది : సీఎం చంద్రబాబు
Published on: Mon Dec 8, 2025 5:13PM
.webp)
గత వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందని..ఆదాయం తగ్గినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం అన్ని వ్యవస్ధలను చక్కదిద్దుతూ అభివృద్ధిని కొనసాగిస్తు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ..తెలుగు దేశం పార్టీ అనేక విజయాలను చవిచూసిందని.. కానీ 2024 విజయం నమ్మకం, విశ్వాసం మీద వచ్చిందని తెలిపారు.
సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామన్నారు. పరీక్ష రాసినప్పుడు పిల్లలు ఎంత టెన్షన్‌గా ఉంటారో తాము అంతే టెన్షన్‌గా ఉంటామని చెప్పుకొచ్చారు. జీఎస్డీపీ విషయంలో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర పథకాల నిధులను ఇతర పథకాలకు మళ్లించడం ద్వారా అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. వైసీపీ పాలన కారణంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతిన్నది అని ముఖ్యమంత్రి అన్నారు. ఇండిగో సంక్షోభాన్ని తాము పర్యవేక్షించడం లేదని ముఖ్యమంత్రి తెలిపారు.
అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని సాధ్యమైనంత వరకు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.టైమ్ ఇచ్చినా DGCA ప్రమాణాలను ఇండిగో పాటించలేదని తెలిపారు. దీంతో విమానాలు రద్దు అయ్యాయి..ఇబ్బందులు వచ్చాయిని ముఖ్యమంత్రి తెలిపారు. పైలట్లకు విశ్రాంతి అవసరం.. నా హెలికాప్టర్ కూడా నిబంధనల మేరకు కొన్ని గంటలే ప్రయాణం చేస్తుందని చంద్రబాబు తెలిపారు.


