జగన్ కోసం చంద్రబాబు వెయిటింగ్.. కరుణించని జగన్...

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్నారు.. ఏంటిది.. అనుకుంటున్నారా..? మీరు చదువుతుంది నిజమే.. జగన్ కోసం చంద్రబాబు ఎదురచూస్తున్నారు. ఇంతకీ ఏ విషయంలో జగన్ కోసం చంద్రబాబు అంతలా ఎదురుచూస్తున్నారు...? అసలు జగన్ కోసం చంద్రబాబు వెయిట్ చేయాల్సినంత అవసరం ఏముంది..? అసెంబ్లీ సమావేశాలే ప్రతిపక్షం లేకుండా.. జగన్ తో పనిలేకుండానే జరుపుతున్నారు.. బిల్లులు ప్రవేశపెడుతున్నారు.. ఆమోదిస్తున్నారు... అన్నీ జరిగి పోతున్నాయి.. ఇంకా జగన్ తో ఏం పనుంది అని డౌట్లు వస్తున్నాయి కదా. అదేంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే..

 

ఏపీలో ఒక సమాచార ప్రధాన కమిషనర్, ముగ్గురు కమిషనర్ల నియామకం కోసం అక్టోబర్ నెలాఖరు వరకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే కదా. దీనికి గాను మొత్తం 290 దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. ఈ సమాచార కమిషనర్ల నియామకం పై ఏపీ సర్కారు త్వరలో ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరి దీనికి జగన్ కు సంబంధం ఏంటంటారా..? ఉంది మరి.. నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీలో ప్రతిపక్షనేత కూడా ఉంటారు. ఏపీలోని ఎంపిక కమిటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్షనేత జగన్, ఆర్థిక మంత్రి యనమల ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు..జగన్ కు సమాచారం కూడా అందించారట కానీ... జగన్ నుండి సరైన రెస్పాన్స్ రావడం లేదట. ఇప్పుడేమో పాదయాత్రలో బిజీగా ఉన్నాడు. అందుకే.. ఓ ఆఫర్ కూడా ఇచ్చాడట. తాను సమావేశానికి హాజరుకాలేనని తన బదులు వేరొక ప్రతినిధిని పంపుతానని చెప్పారట. కానీ జగన్ నుంచి మాత్రం ఆశించిన స్పందన కనిపించడంలేదు. రూల్స్ ప్రకారం ప్రతిపక్షనేత స్వయంగా రావాలి.. అంతే తప్ప వేరొకరిని పంపటానికి వీళ్లేదట. దీంతో జగన్ ఎప్పుడొస్తాడా అని చంద్రబాబు ఎదురుచూస్తున్నారట. మరి జగన్ ఎప్పుడొస్తాడో..ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో... అసలు ఆయన లేకుండానే డెసిషన్ తీసుకుంటారా..?చూద్దాం ఏం జరుగుతుందో...