TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సైనా, సింధుల సక్సెస్ లో చంద్రబాబు పాత్ర ఎంత?

Published on: Thu Aug 25, 2016 2:27PM

 

సింధు ఒలంపిక్స్ లో పతకం సాధించిన తరువాత తెలుగు రాష్ట్రాలు రెండూ పూనకంతో ఊగిపోయాయి. అసలు ఇంకే వార్తా లేదన్నట్టు వ్యవహారం నడిచింది. ఆమె సెమీఫైనల్ గెలిచి పతకం కన్ ఫర్మ్ అయ్యాక హీట్ మరీ పెరిగింది. రియో నుంచి హైద్రాబాద్ వచ్చి విజయవాడ చేరుకుని ఇరు రాష్ట్రాల సన్మానాలు స్వీకరించే దాకా సింధు మేనియా నిరాటంకంగా సాగింది. అయితే, ఒకవైపు జనం సంతోషంతో ఊగిపోతుంటే సోషల్ మీడియాలో మాత్రం కొందరు సెటైర్ సత్తిపండు అవతారాలు ఎత్తారు. ఎప్పటిలాగే చంద్రబాబును టార్గెట్ చేస్తూ పోస్ట్ లు విసరటం ప్రారంభించారు!

 

సింధు సక్సెస్ కి చంద్రబాబుపై సెటైర్లకి ఏంటి లింక్ అంటారా? మరేం లేదు సింధుకి సిల్వర్ ఖాయం చేసుకున్న వెంటనే ఓ సభలో బాబు ఆమె విజయానికి తన కృషే కారణమన్నారు! ఇదే అన్ని కుతలకి కారణమైపోయింది...నిజంగా సింధు విజయానికి చంద్రబాబుకి ఏమైనా లింక్ వుందా? పైకి చూస్తే ఏమీ లేనట్లే వున్నా యాక్చువల్ గా వుంది. అది అర్థం చేసుకునే ఓపిక, నిజాయితీ రెండూ లేని నెటిజన్లు ఎడాపెడా విమర్శలు, జోక్ లు మొదలుపెట్టారు.

 

సింధు సక్సెస్ కి మెయిన్ రీజన్ ఆమె కోచ్ గోపిచంద్. ఆయన హైద్రాబాద్ లో కోచింగ్ అకాడమీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు చంద్రబాబే గచ్చిబౌలిలో 5ఎకరాల భూమి ఇచ్చారు. అలా మొదలైంది ఇప్పటి ఈ ఒలంపిక్ పతకాల వేట. సైనా, సింధు గోపిచంద్ అకాడమీలో, చంద్రబాబు ఇచ్చిన భూమి మీదే ప్రాక్టీస్ చేసి మెడల్స్ గెలుచుకున్నారు! అంతే కాదు, ఇప్పటికి పదహారేళ్ల కిందే 2000వ సంవత్సరంలో బాబు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ పాలసీ ప్రకటించారు! ఎన్నో ప్రొత్సాహకర చర్యలు తీసుకున్నారు. కాని, అంతలోనే అధికారం కోల్పోవటంతో అవ్వన్నీ అర్దాంతరంగా ఆగిపోయాయి. తరువాత వచ్చిన ముఖ్యమంత్రులెవరూ ఆటల్ని ఆదుకున్న పాపన పోలేదు....

 

ఇదంతా విన్నాక ఇప్పుడు చెప్పండి... తన పాలన కాలంలో ఇచ్చిన ప్రొత్సాహంతో ఇవాళ్ల మెడల్ వచ్చిందని బాబు చెప్పటం తప్పెలా అవుతుంది? పైగా ఇప్పుడు కూడా మెడల్ గెలిచిన సింధుని సన్మానించటమే కాకుండా అమరావతిలో అకాడమి స్టార్ట్ చేయటానికి ఆయన గోపిచంద్ ని ఆహ్వానించారు. ఒక ముఖ్యమంత్రిగా ఒక నాయకుడు చేయాల్సింది ఇదే కదా? దీనికి కూడా సెటైర్లు వేస్తూ మేధావుల్లా ఫీలైతే మనం ఏం చేయగలం... ఎవరి పిచ్చి వారికానందం!