జైట్లీ మాట్లాడుతున్నప్పుడు ఆందోళనలు చేయండి...

 

కేంద్ర బడ్జెట్ విషయంలో ఏపీకి అన్యాయం జరిగిన నేపథ్యంలో పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు గత నాలుగు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈరోజు కూడా యధావిథిగా ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎంపీల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు మొదలయ్యాయి. అయితే ఈరోజు పార్లమెంట్లో వ్యవహరించాల్సిన తీరుపై చంద్రబాబు ఎంపీలకు ఆదేశాలు ఇచ్చారట.  ఉభయసభల్లో ఆందోళనలను తీవ్రతరం చేయాలని.. బడ్జెట్ పై అరుణ్ జైట్లీ సమాధానం చెప్పేటప్పుడు ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని, నినాదాలు చేయాలని సూచించారట. ఏ క్షణంలోకూడా వెనక్కి తగ్గవద్దని స్పష్టం చేశారట.