TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గ్రేటర్ ప్రచార బరిలో చంద్రబాబు..

Published on: Tue Jan 5, 2016 11:06AM

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ తరుపున పార్టీ అధినేత చంద్రబాబు కూడా ప్రచార బరిలో దిగుతున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఈనెల 9న నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ బహిరంగ సభకు 30 వేల మంది కార్యకర్తలు వస్తారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. మరోవైపు బీజేపీతో చర్చలు జరిపే బాధ్యతను ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి హెదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అద్యక్షులకు అప్పగించారు. అంతేకాదు చర్చల సమయంలో సుజనా చౌదరి సహకారం కూడా తీసుకోవాలని చంద్రబాబు ఆగ్రనేతలకు సూచించారు.