TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దుర్గ గుడి ఫ్లైఓవర్ శంకుస్థాపన.. గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు

Published on: Sat Dec 5, 2015 12:08PM


విజయవాడలోని దుర్గ గుడి ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నితిన్  గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ దుర్గాదేవి కొలువై ఉన్న విజయవాడకు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. దాదాపు రూ 65 వేల కోట్ల పనులకు అనుమతి లభించిందని.. రాష్ట్రం భూములు ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని అన్నారు. చంద్రబాబు ఎన్డీఏకు అత్యంత సన్నిహితుడు.. ఆయనకు సహకరించాల్సిన అవసరం మాకు ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాదు నాని లాంటి నిబద్ధత ఉన్న ఎంపీ దేశానికి కావాలని గడ్కరీ నానిని అభినందించారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ 65 వేల ప్రాజెక్టులు ప్రకటించిన గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణ పుష్కరాలలోగ దుర్గగుడి ఫ్లైఓవర్ ను పూర్తి చేస్తామని తెలిపారు. దుర్గ గుడి ఫ్లైఓవర్ నిర్మాణానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిచ్చారని వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.