TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముగిసిన బీజేపీ, టీడీపీ సమావేశం.. విమర్శలు చేసుకోవడం మానుకోవాలి..

Published on: Sat Dec 5, 2015 11:09AM

విజయవాడ చంద్రబాబు నివాసంలో టీడీపీ, బీజేపీ సమన్వయకమీటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి టీడీపీ నేతలు కళా వెంకట్రావు, బోండా ఉమమహేశ్వరరావు.. బీజేపీ నేతలు కంభంపాటి, మాణిక్యాలరావు, కామినేని, గోకరాజు గంగరాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా బీజేపీ నేత కంతేటి సత్యనారాయణ రాజు మాట్లాడుతూ ఇకనుండి ప్రతి నెల సమావేశం కావాలని.. ఇరుపార్టీ నేతలు ఒకరినొకరు విమర్శించుకోవడం మానుకోవాలని అన్నారు. ప్రజాసమస్యలపై సమన్వయంగా ముందుకెళ్లాలని సూచించారు.