చంద్రబాబుతో పపన్ భేటీ..!
Published on: Thu Nov 12, 2015 11:16AM
.jpg)
జనసేన అధినతే పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు. విజయవాడలోని సీఎం క్యాంపు ఆఫీసుకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ప్రధానంగా రాజధాని భూసేకరణ, రైతు సమస్యలపై వీరిద్దరూ చర్చించనున్నట్టు తెలుస్తోంది. కాగ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఇరువురి మధ్య భేటీకి కామినేని శ్రీనివాస్ చొరవ తీసుకుని మధ్యవర్తిత్వం నెరిపినట్లు చెబుతున్నారు.


