TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దేశంలోనే ఎక్కువ పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఏపీనే : చంద్రబాబు

Published on: Fri Aug 1, 2025 5:53PM

 

వైసీపీ అధినేత జగన్‌‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. పర్యటనల పేరుతో మంచిగా తిరిగితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మభ్యపెట్టి ప్రజలను అసౌకర్యం కల్పిస్తే ఊరుకోమని హెచ్చరించారు. వైఎస్ఆర్ కడప  జమ్మలమడుగు మండలం, గూడెంచెరువు గ్రామంలో ఉల్సాల అలివేలమ్మ అనే లబ్ధిదారు ఇంటికెళ్లి వితంతు పెన్షన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు .ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి తొక తిప్పితే, దానిని కట్ చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. 

తొక తిప్పిన నేతలపై నేరుగా కేసులు పెడతామని స్పష్టం చేశారు. తమ పార్టీలో అయిన సరే నేతలు తప్పు చేస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో సీఎం కాసేపు ముచ్చటించి సమస్యలు తెలుసుకున్నారు. ఆమె పెద్దకుమారుడు వేణుగోపాల్‌కు చెందిన చేనేత మగ్గాన్నిముఖ్యమంత్రి పరిశీలించారు. 1వ తరగతి చదవుతున్న తన ఆరేళ్ల కుమారుడు హర్షవర్థన్‌కు తల్లికి వందనం కింద లబ్ధి చేకూరిందని వేణుగోపాల్ సీఎంకు తెలిపారు. 

అనంతరం అలివేలమ్మ చిన్నకుమారుడు, ఆటోడ్రైవర్ జగదీష్‌తో మాట్లాడారు. అదే ఆటోలో సీఎం చంద్రబాబు వేదిక వరకు ప్రయాణించిన ముఖ్యమంత్రి వారి కుటుంబ ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే ఎక్కువ పింఛను ఇచ్చే ఆంధప్రదేశ్ అని సీఎం తెలిపారు. అర్హులైన వితంతువులకు సాయం చేస్తున్నామని చెప్పారు. పింఛన్ల విషయంలో మన తర్వాత తెలంగాణ, కేరళ ఉన్నాయన్నారు. పేదలకు సాయం చేస్తే కలిగే తృప్తి మరిదేంట్లోనూ రాదని ముఖ్యమంత్రి అన్నారు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అసభ్యంగా మాట్లాడిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి మాటలని జగన్ సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రసన్నని జగన్‌ పరామర్శించడం ఏంటనీ ధ్వజమెత్తారు. 

పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలి.. ఖండించాలని హితవు పలికారు. నల్లపురెడ్డిని మందలించాల్సింది పోయి.. జగన్ ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. మహిళలపై ఇంకా విరుచుకుపడాలనే ధోరణిలోనే జగన్‌ వైఖరి ఉందని మండిపడ్డారు. నాయకుడే రెచ్చగొడితే కిందిస్థాయి నేతలు ఇష్టానుసారం మాట్లాడరా? అని నిలదీశారు. ఎన్టీఆర్‌ ఆలోచనతోనే రాయలసీమకు  నీళ్ళు వచ్చాయని సీఎం తెలిపారు. ఆయన సాగునీటి ప్రాజెక్టుల చంద్రబాబు గుర్తుచేశారు. రూ.3,800 కోట్లతో హంద్రీనీవా పనులు చేపట్టామని చెప్పుకొచ్చారు. 

త్వరలోనే హంద్రీనీవా పనులు పూర్తిచేసి చెరువులన్నీ నింపుతామని స్పష్టం చేశారు. సముద్రంలోకి వెళ్లే నీటిని వాడుకుంటే కరవు అనేదే ఉండదని సీఎం స్పష్టం చేశారు, వివరించారు. రాయలసీమకు పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. త్వరలోనే కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. 2028 డిసెంబర్‌ నాటికి స్టీల్‌ప్లాంట్‌ తొలిదశ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రేపు అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. కుటమి సర్కార్  రూ.14 వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.6 వేలు ఇవ్వబోతున్నాయని స్పష్టం చేశారు. మొత్తంగా రైతులకు రూ.20 వేలు ఇవ్వబోతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.