TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సింగపూర్‌లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు

Published on: Sun Jul 27, 2025 11:35AM

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ చేరుకున్నారు. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు సీఎం సింగపూర్ లో పర్యటించనున్నారు. సింగపూర్ కు చేరుకున్న సీఎంకు స్థానిక తెలుగు ప్రజలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, ఏపీఎన్ఆర్టీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి తాను బసచేసే హోటల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి, మంత్రుల బృందానికి స్థానిక తెలుగు కుటుంబాలకు చెందిన వారు స్వాగతం పలికారు. 

సీఎంకు స్వాగతం పలికేందుకు సంప్రదాయ వస్త్రధారణలో తెలుగు కుటుంబాలకు చెందిన మహిళలు తరలి వచ్చారు.. హారతులు పట్టారు. చిన్నారులు కూచిపూడి నృత్యాలతో స్వాగతించారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆయన బస చేస్తున్న హోటల్ ప్రాంగణంలో తెలుగు కుటుంబాల సందడి నెలకొంది. సింగపూర్ పర్యటనలో భాగంగా మొత్తం 29 కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇవాళ మధ్యాహ్నం తెలుగు డయాస్పోరా సమావేశానికి ముఖ్యమంత్రి, మంత్రులు  నారా లోకేష్, పి.నారాయణ, టీజీ భరత్ లు హాజరు కానున్నారు.