TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

క్యాన్సర్‌తో బాధపడుతున్న కార్యకర్తకు చంద్రబాబు ఫోన్‌లో పరామర్శ

Published on: Sat Jul 5, 2025 9:34PM

 

క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోన్న పార్టీ కార్యకర్త అభిమతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్చారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆకుల కృష్ణతో చంద్రబాబు వీడియో కాల్ చేసి మాట్లాడారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం, మోరంపూడి జంక్షన్‌కు చెందిన ఆకుల కృష్ణ మొదటి నుంచీ టీడీపీ అభిమాని. చంద్రబాబు అంటే అమిత ఇష్టం. అయితే ఆయన ఇటీవల క్యాన్సర్ వ్యాధికి గురై బాధపడుతున్నారు. తన ఆరోగ్య క్షీణిస్తుండడంతో చంద్రబాబుతో ఒక్కసారైనా మాట్లాడాలని ఆయన కోరుకున్నారు. 

ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు  స్వయంగా ఆకుల కృష్ణకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని.. అన్ని విధాలా తాను అండగా ఉంటానని కృష్ణకు, ఆయన కుటుంబానికి ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అత్యంత విషమంగా ఆరోగ్య పరిస్థితి ఉన్న కారణంగా సరిగా మాట్లాడలేని స్థితిలో ఉన్న కృష్ణ... స్వయంగా చంద్రబాబు ఫోన్ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. తనకు ఇప్పుడు ఎంతో సంతృప్తిగా ఉందని అన్నారు.