TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చర్మకారుడు సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు

Published on: Tue Jul 1, 2025 8:50PM

 

తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు నియోజకవర్గం, మలకపల్లి గ్రామంలో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కారులో స్వయంగా చర్మకారుడు పోశిబాబును ఎక్కించుకున్నారు. 

కొవ్వూరు మండలం దర్మవరం గ్రామం నుంచి తాళ్లపూడి మండలం మలకపల్లి వరకు సుమారు 2 కి.మీ మేర పోశిబాబుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించారు. కారులో వెళ్తున్న సమయంలో పోశిబాబు వృత్తి, జీవన స్థితిగతులు, ఎదుర్కొంటున్న సమస్యలు, కుటుంబ నేపథ్యం గురించి పోశిబాబును అడిగి  తెలుసుకున్నారు. అనంతరం పోశిబాబు ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు.