TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోడ్డు ప్రమాదంలో ఎస్సై కానిస్టేబుల్ మృతిపై...చంద్రబాబు విచారం

Published on: Thu Jun 26, 2025 5:54PM

 

కేసు విచారణలో భాగంగా నిందితుల కోసం కారులో హైదరాబాద్ వెళ్తున్న ఏపీ పోలీసులు సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద రోడ్డు ప్రమాదానికి గురికావడం విషాదకరమని సీఎం చంద్రబాబు  తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్సై ఎం. అశోక్, కానిస్టేబుల్ బ్లెస్సన్ జీవన్ లు అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ స్వామి, డ్రైవర్ రమేష్‌లకు అందుతున్న వైద్య సహాయం గురించి అధికారులతో మాట్లాడినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

 వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించినట్లు చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు, అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చంద్రబాబు వివరించారు. బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.