TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తల్లికి వందనంపై వైసీపీ తప్పుడు ప్రచారంపై న్యాయపోరాటం : లోకేష్

Published on: Fri Jun 13, 2025 8:43PM

 

తల్లికి వందనంపై తప్పుడు ప్రచారం చేస్తే వైసీపీ నేతలకు తీవ్ర పరిణామాలు తప్పవు అని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. తల్లికి వందనంలో రూ. 13 వేలు ఇచ్చి రూ. 2 వేలు నా ఖాతాలో పడ్డాయన్న ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు రుజువు చేయాలి, లేకుంటే క్షమాపణ చెప్పి ప్రకటన ఉపసంహరించుకోవాలి. అలా చేయకుంటే వారిపై చట్ట ప్రకారం ముందుకెళ్తా లోకేష్ హెచ్చరించారు. వైసీపీ ఆరోపణలని  గతంలో మాదిరి భరించేది లేదు. నిరాధార ఆరోపణలు చేసేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు'. అని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. అటు, ఉపాధ్యాయుల బదిలీలు జూన్ 16 కల్లా పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఆంధ్రా మోడల్ ఎడ్యుకేషన్' దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువుతాం. ప్రజలందరూ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి. 

తల్లికి వందనం అర్హులు ఎంత మంది ఉంటే అంత మందికీ లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 42 లక్షల మందికి మాత్రమే అమ్మ ఒడి ఇచ్చింది. కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మంది విద్యార్ధులకు పథకాన్ని వర్తింప చేస్తున్నాం. అర్హులు ఇంకా ఉన్నా ఇస్తాం'. అని లోకేష్ తెలిపారు. ఏపీలో కూటమి సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'తల్లికి వందనం' పథకం కింద అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, సూపర్ సిక్స్‌లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేస్తుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పిల్లల తల్లులు తమ ఆనందాన్ని వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు.