TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం : సీఎం చంద్రబాబు

Published on: Wed May 28, 2025 7:30PM

 

తెలుగుజాతి ఉన్నంత కాలం తెలుగు దేశం పార్టీ ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన అనంతరం ఆయన మాట్లాడారు.  దేవుడి ఇచ్చిన శక్తి మేరకు పార్టీని సమర్థవంతంగా నడిపిస్తాని ఆయన అన్నారు. నా బలం, బలగం టీడీపీ నాయకత్వమే అన్నారు. నా ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ  ధన్యవాదాలు తెలిపారు. మహానాడులో ఆరు శాసనాలపై అర్థవంతంగా చర్చలు జరిగాయి. రాబోయే 40 ఏళ్లకు ప్రణాళిక రచించుకున్నాం. నక్సలిజం రూపుమాపడానికి నిరంతరం పోరాడిన పార్టీ టీడీపీ అని ఆయన అన్నారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం తుదముట్టించి అభివృద్ధికి బాటలు పరిచామని పేర్కొన్నారు.  రాయలసీమ రాళ్ల సీమ కాదు..రత్నాల సీమగా మారుస్తానని చెప్పాని చంద్రబాబు స్పష్టం చేశారు. కోనసీమ కంటే సంపదలో అనంతపురం ముందుండడానికి టీడీపీ అని అన్నారు. 

బసకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని సీఎం చంద్రబాబు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు నేను ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదని ఆయన అన్నారు. నదుల అనుసంధానంతో తెలంగాణకు లాభమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాకు రెండు కళ్లు అని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్‌‌ను అభివృద్ధి చేసింది నేనే అని ఆయన అన్నారు. 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.రూ.9వేల కోట్లతో కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. దీంతో కడప స్టీల్‌ ప్లాంట్ ద్వారా 3వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఆయన తెలిపారు.175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి.. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.