TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీ చేసిన విధ్వంసానికి గాడిలో పెట్టాలంటే పదేళ్లు పడుతుంది : సీఎం చంద్రబాబు

Published on: Fri May 23, 2025 9:26PM

 

గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసానికి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే పదేళ్లు పడుతుందని ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత  మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రజలు తమకు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.‘ 2019-24 మధ్య ఏపీలో భారీగా విధ్వంసం జరిగింది. జగన్ చేసిన విధ్వంసం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే పదేళ్లు పడుతుందన్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కూటమి సర్కార్ రాగానే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. అందుకు అనుగుణంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. గత ప్రభుత్వం రూ.1.20లక్షల కోట్ల బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టింది. ఈ ఏడాదిలో రాష్ట్రానికి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి.  హస్తినకు వచ్చిన ప్రతిసారి ఏడుగురు కేంద్రమంత్రులను కలుస్తున్నా. సూర్యఘర్‌ కింద 35లక్షల కుటుంబాలకు కరెంట్ ఇవ్వాలని ఆకాంక్షించామని  సీఎం తెలిపారు. 

ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 10వేల కుటుంబాలకు విద్యుత్‌ ఇస్తాం. సూర్యఘర్‌ అమలుకు మద్దతు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. మా ప్రభుత్వం ఏపీ ఇంటిగ్రేటెడ్‌ క్లీన్‌ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం 72 గిగావాట్ల గ్రీన్‌ ఎనర్జీని ఉత్పత్తి చేయాలి. రూ.28,346 కోట్ల విలువైన గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ ఇవ్వాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషీని కోరాం. అందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ పోలవరంపై సీఆర్‌ పాటిల్‌తో చర్చించాం. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తికి ప్రయత్నాలు చేస్తున్నాం. డయాఫ్రమ్ వాల్‌ను వైసీపీ ప్రభుత్వం నీళ్లలో కలిపేసింది. నాణ్యతలో రాజీపడకుండా పోలవరం నిర్మిస్తాం. బనకచర్ల ప్రాజెక్ట్‌తో ఎవరికీ అభ్యంతరం ఉండదు. బనకచర్ల ప్రాజెక్ట్‌కు రూ. 80 వేల కోట్లు ఖర్చు అవుతుంది. బనకచర్ల ప్రాజెక్ట్‌ ఏపీకి గేమ్‌ ఛేంజర్‌ అవుతుంది. సముద్రంలోకి వెళ్లే నీళ్లనే బనకచర్లకు మళ్లిస్తాం’ అని అన్నారు.