TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రపంచ వ్యాప్తంగా సీఎం చంద్రబాబు బర్త్ డే సెలబ్రేషన్స్..ట్రెండింగ్‌లో #HBDBabu

Published on: Sat Apr 19, 2025 9:16PM

 

ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నారై టీమ్ ఆధ్వర్యంలో పలు నగరాల్లో అంగరంగ వైభవంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. టీడీపీ అభిమానులు, చంద్రబాబు అభిమానులు కేట్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఐటీని ప్రోత్సహించడంతోపాటు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లాగే నవ్యాంధ్రప్రదేశ్‌ను కూడా అభివృద్ధి పథంలో నడిపించారని పేర్కొన్నారు. 

చంద్రబాబు నాయుడు బర్త్‌డే ఈ సందర్భంగా ఆయనకు దేశవిదేశాల నుంచి నాయకులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నేటితో ఆయన 75వ ఏటలోకి ప్రవేశించారు. వయసు పైబడినా యువకులకి తీసిపోని ఆరోగ్యం ఆయనది. మండుటెండల్లో ఆయన ప్రజల కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేయడం కోసం కృషి చేస్తున్నారు. ఇప్పటికీ హైదరాబాద్ ఐటీ రంగం పేరు చెబితే CBN అనే పేరు ప్రపంచ వ్యాప్తంగా వినబడుతుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సామాజిక మాధ్యమాలలో శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. #HBDBabu హ్యాష్ ట్యాగ్ దేశ వ్యాప్తంగా ట్వీట్టర్‌లో ట్రెండ్ కొనసాగుతుంది.