TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో రోడ్ల మరమ్మతులకు భారీగా నిధులు

Published on: Wed Oct 8, 2025 4:01PM

 

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల మరమ్మతుల కోసం కూటమి ప్రభుత్వం రూ.1000 కోట్ల నిధులు మంజూరు చేసింది. మొత్తం 274 రహదారుల మరమ్మతుల కోసం ఈ నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పాలనాపరమైన అనుమతులను మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. స్టేట్‌ హైవేస్‌లో 108 పనులకు రూ.400 కోట్లు, జిల్లా రోడ్లలో 166 పనులకు రూ.600 కోట్లు మంజూరు చేశారు. 

గత వైసీపీ ప్రభుత్వం రోడ్లను పట్టించుకోలేదు. జగన్ హయాంలో చాలా రోడ్లు అధ్వాన్నంగా మారాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై భారీగా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ఆస్పత్రుల పాలయ్యారు. దీంతో కొత్త రోడ్లతో పాటు మరమ్మతులు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల దృష్టి పెట్టింది. రోడ్లు, భవనాల శాఖ అధికారులతో చర్చించింది. మొత్తం 274 రోడ్ల పనులు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ. 1000 కోట్లు నిధులు మంజూరు చేసింది.