TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చెత్తను తొలిగించి...చెత్త పాలిటిక్స్ క్లీన్‌ చేస్తాం : చంద్రబాబు

Published on: Sat Sep 20, 2025 5:10PM

 

గతంలో పల్నాడు జిల్లా మాచర్లలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక్కడ పాలనంతా ముఠా నాయకులే చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. మాచర్లలో ఎంతటి భయానక వాతావరణం ఉండేదంటే, తన లాంటి నాయకుడు కూడా ఇక్కడికి రాలేని దుస్థితి ఉండేదని  ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు ఎవరైనా స్వేచ్ఛగా ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి కల్పించామని ఆయన తెలిపారు.

‘స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా మాచర్లలో నిర్వహించిన ‘ప్రజావేదిక’ బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర’ కార్యక్రమం లో భాగంగా మాచర్లలో జరిగిన ‘ప్రజావేదిక’ బహిరంగ సభలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చెత్తను మాత్రమే కాకుండా, చెత్త రాజకీయాలను కూడా పూర్తిగా శుభ్రం చేస్తామ‌ని స్పష్టం చేశారు.

 “పల్నాడులో అరాచకాలు, దాడులు జరగనివ్వం. రౌడీయిజం, నేరాలు, ఘోరాల విషయంలో చూస్తూ ఊరుకోం. ప్రజల ఆస్తులను కాపాడేందుకు మేమే రక్షణగా నిలుస్తాం,” అని ఆయన హెచ్చరించారు.రాయలసీమలో గతంలో ముఠా సంస్కృతిని అణచివేశామని, పల్నాడులో కూడా అలాంటి పరిస్థితులకు తావివ్వబోమని ఆయన తేల్చిచెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. 

రోడ్లపై 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, దానిపై పన్ను విధించి ప్రజలను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పన్నును రద్దు చేశామని గుర్తుచేశారు.“చెత్తను రోడ్ల నుండి తొలగించడం మాత్రమే కాదు, మనసులలోని చెత్తను కూడా తొలగించాలి,” అని ఆయన పిలుపునిచ్చారు. మాచర్లలో ఇటీవల వరకు ప్రజాస్వామ్యానికి స్థానం లేకపోయిందని, ఎవరి ప్రవర్తన సరిగా లేకపోతే ప్రజలు క్షమించరని వ్యాఖ్యానించారు.