TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉల్లి రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

Published on: Fri Sep 19, 2025 9:15PM

 

ఉల్లి రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. హెక్టారుకు రూ.50 వేల పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లపై  సచివాలయంలో ముఖ్యమంత్రి ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు.  నేటి నుంచే క్వింటాకు రూ.1,200 చొప్పున రైతుల వద్ద నుంచి ఉల్లిని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. 

ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని సూచించారు. కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం .ఉల్లికి గిట్టుబాటు ధర వచ్చే వరకూ కమ్యూనిటీ హాళ్లల్లో నిల్వ చేయడానికి రైతులకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. వచ్చే పది రోజుల్లో ఐదువేల మెట్రిక్ టన్నుల ఉల్లి పంట వస్తుందని అధికారులు వివరించారు. 

కొనుగోలు చేసి ఆరబెట్టిన ఉల్లిని రైతు బజార్లల్లో విక్రయించేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. తక్షణం ఉల్లిని కొనుగోలు చేసి అన్నదాతకు నష్టం రాకుండా చూడాలని ఆదేశించారు. అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. రైతుబజార్ల సంఖ్యను పెంచటంతోపాటు ఆధునికీకరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు