సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దు
Published on: Sun Sep 14, 2025 12:20PM
.webp)
సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దయింది. అక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పర్యటన రద్దయినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఏవియేషన్ అధికారులు నుంచి క్లియరెన్స్ వస్తే ముఖ్యమంత్రి తిరుపతి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నేడు తిరుపతిలో జరుగుతున్న మహిళా సాధికారత సదస్సులో సీఎం పాల్గొనాల్సి ఉంది.వాతావరణం అడ్డంకిగా మారడంతో ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. అమరావతి- తిరుపతి మధ్య దట్టమైన మేఘాలు అలుముకోని ఉండటంతో అధికారులు క్లియరెన్స్ ఇవ్వలేదు.


