TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కుప్పం ప్రజల దశాబ్దాల కల నెరవేరింది : సీఎం చంద్రబాబు

Published on: Sat Aug 30, 2025 3:19PM

 

2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని సీఎం చంద్రబాబు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం పరమసముద్రంలో బహిరంగ సభలో కుప్పం ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసగించారు. కుప్పానికి రెండేళ్లు ముందుగానే కృష్ణా పుష్కరాలు వచ్చాయిని కుప్పం ప్రజల ఆనందాన్ని చూస్తే తృప్తి కలుగుతోందని సీఎం తెలిపారు. నా జీవితంలో ఇది పవిత్రమైన రోజు.. మీ ఇంటి బిడ్డగా కుప్పం ప్రజలు నన్ను ఆదరించారని చంద్రబాబు తెలిపారు.

 కృష్ణమ్మను కుప్పానికి తెచ్చాను.. నా ఆనందం మాటల్లో చెప్పలేను.. నా సంకల్పం నిజమైందని ఆయన తెలిపారు. 738 కిలో మీటర్ల నుంచి కుప్పం పరమసముద్రానికి కృష్ణా జలాలు తెచ్చామని దీంతో ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల నిర్మాణంతో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిస్థితి మారిందని సీఎం తెలిపారు.

అందుకే శతాబ్దాలు గడిచినా... కాటన్ దొరను గోదావరి ప్రజలు ఇంకా మరువలేదని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే రాయలసీమకు నీళ్లు తెచ్చేందుకు సంకల్పం తీసుకున్న ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. పశువులను కాపాడుకోవడానికి రైళ్లల్లో నీళ్లు తెప్పించాల్సిన దారుణమైన కరవు రాయలసీమలో ఉండేది.. అప్పుడే చాలా బాధపడ్డాను.. ఈ పరిస్థితి మార్చాలనుకున్నాని ఆయన తెలిపారు.

1999లో హంద్రీ-నీవాకు శంకుస్థాపన చేశాను. శ్రీశైలం మల్లన్న దగ్గరున్న జలాలను కుప్పం మల్లన్న వద్దకు చేర్చామని తెలిపారు. కుప్పం ప్రజల ఆనందంలో పాలుపంచుకునేందుకు సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి పరమసముద్రం చెరువులో బోటులో పర్యటించాని సీఎం తెలిపారు. రాయలసీమను రాళ్ల సీమ కానివ్వను... రతనాల సీమ చేస్తానమని ముఖ్యమంత్రి వెల్లడించారు.

2014-19 మధ్య కాలంలో రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.12,500 కోట్లు ఖర్చు పెట్టితే..గత వైసీపీ ప్రభుత్వం 2019-24 మధ్య కాలంలో సీమ ప్రాజెక్టుల కోసం రూ. 2000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని తెలిపారు. సెట్టింగులు వేశారు.. గేట్లు తెచ్చారు.. నీళ్లు కూడా బయట నుంచే తెచ్చి.. విడుదల చేసినట్టు మభ్య పెట్టారు. విమానం ఎక్కేలోగానే నాడు విడుదల చేసిన నీరు ఆవిరైపోయిందని సీఎం చంద్రబాబు తెలిపారు