చంద్రబాబు ప్రకటన.. కొన్ని ముఖ్యాంశాలు...

 

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి సంబంధించిన 20 పేజీల ప్రకటనను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శాసనసభలో విడుదల చేశారు. ఈ ప్రకటనలోని కొన్ని ముఖ్యాంశాలు..

 

* భూ సేకరణ ద్వారా రాజధానిని నిర్మించాలని భావిస్తున్నాం.

 

* శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రజాభిప్రాయాన్ని బలపరిచింది.

 

* రాష్ట్ర ప్రగతి సాధన, ప్రజల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం.

 

* ప్రతి జిల్లాలో ఒక ఫుడ్ పార్క్.

 

* భూ సేకరణ విధి విధానాలపై ఉపసంఘం.

 

* రాబోయే రోజుల్లో ఒక్కో సంవత్సరం ఒక్కో జిల్లాలో స్వాతంత్ర్య వేడుకలు.

 

* ఏపీ అభివృద్ధికి ఏడు మిషన్లు, 5 గ్రిడ్ల ఏర్పాటు.

 

* విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలు అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి.

 

* అనంతపురం కరవు నివారణకు బిందు, తుంపర సేద్యాలకు ప్రాధాన్యం

 

* శ్రీకాకుళంలో విమానాశ్రయం, స్మార్ట్ సిటీగా అభివృద్ధి.

 

* వీసీఐసీ కారిడార్ పరిధిలో కాకినాడ.

 

* తూర్పు గోదావరి జిల్లాలో పెట్రోలియం కారిడార్, తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు.

 

* తూర్పు గోదావరి జిల్లాలో కొబ్బరి పీచు ఆధారిత పారిశ్రామిక కాంప్లెక్స్.

 

* విజయనగరంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం.