TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు

Published on: Thu Jun 13, 2024 9:08AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం (జూన్ 12)న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు అదే రోజు సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో సహా తిరుపతి చేరుకున్నారు.

ఆ రోజు రాత్రి తిరుమలలో బస చేసిన ఆయన గురువారం (జూన్ 13) ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ ప్రవేశం చేశారు. ఆలయ మహాద్వారం వద్ద చంద్రబాబుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, ఆలయ అర్చకులు ఇస్తికఫల్  స్వాగతం పలికారు.  

ధ్వజ స్తంభానికి నమస్కరించి బంగారు వాకిలిలొకి ప్రవేశించి  చంద్రబాబు తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు.