TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సియం, బొత్స తోడు దొంగలు

Published on: Wed Nov 27, 2013 7:08PM

 

రాష్ట్ర విభజన అంశం తెరమీదకు వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్‌ పార్టీ మీద గుర్రుగా ఉన్న ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు జెసి దివాకర్‌ రెడ్డి మరోసారి వివాదాస్ప వ్యాఖ్యలు చేశారు.  విభజన అంశాలను దాచటంలో  కిరణ్, బొత్స సత్యనారాయణ ఇద్దూ ఇద్దరే అని వారు తోడు దొంగలని అన్నారు. ఈ ఇద్దరికే కాదు సీమాంద్ర కేంద్ర మంత్రులకు కూడా విభజనకు సంబందించిన అన్ని విషయాలు తెలుసన్నారు.

కావాలనే జాతీయ నాయకులు సీమాంద్ర ప్రజలని మభ్యపెట్టారని అందరికి అంత తెలిసే ప్రజలని మోసంచేశారన్నారు. పార్టీ నిర్ణయాన్ని దిక్కరిస్తే చర్యలు తప్పవన్న బొత్స వ్యాఖ్యలను జెసి సమర్ధించారు. చర్యలు తీసుకునే అధికారం బొత్సకు ఉందన్నారు.