TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అందుకే 'యువ'కిరణాలు:రాఘవులు విమర్శ

Published on: Sun Feb 12, 2012 1:45PM

హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న ఐదు లక్షల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించేందుకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి యువకిరణాలు పథకాన్ని ప్రవేశపెట్టారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు విమర్శించారు. మంత్రుల జీతాలు పెంచడానికి నిధులు ఉంటాయి కానీ జూనియర్ డాక్టర్ల జీతాలు పెంచడానికి నిధులు లేవా అని ఆయన ప్రశ్నించారు. న్యాయమైన జుడాల దీక్షపై ప్రభుత్వం స్పందించక పోవడం శోచనీయం అన్నారు. ఇటీవల మద్యం సిండికేట్లపై ఎసిబి దాడులు రాజకీయ ప్రమేయంతోనే జరుగుతున్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ విలీన ఒప్పందంలో భాగంగానే కృష్ణా జిల్లాలోని భవానీ ద్వీపాన్ని చిరంజీవి వర్గానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాస రావుకు అప్పగించారని  ఆదివారం హైదరాబాదులో ఆరోపించారు. ఈసారి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాలని ఆయన అధికార, విపక్షాలకు సూచించారు.