సీఎం కు షాక్..ఎమ్మెల్యే బొడ్డేపల్లి మనస్థాపం
Published on: Mon Feb 6, 2012 1:48PM
శ్రీ
కాకుళం: కాబినెట్ విస్తరణ జరగకముందే సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి షాక్ తగిలింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి తనకు పదవి రాకపోవడంతో మనస్థాపం చెందారు. రాజీనామాకు కూడా సిద్ధపడినట్లు సమాచారం. మంత్రి పదవి రాకుంటే రాజీనామా విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని ఆమె చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నుండి చీప్ విప్ కొండ్రు మురళికి కేబినెట్లో అవకాశం దక్కిన విషయం తెలిసిందే. దీంతో ఆమె మనస్థాపం చెందినట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గంలో బిసిలకు అన్యాయం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన సామాజిక వర్గానికి న్యాయం జరగాల్సిందేనని ఆమె అన్నారు. తాను గతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరతారనే ఊహాగానాలు వినిపించినప్పటికీ తాను వెళ్లలేదన్నారు. నేను ముఖ్యమంత్రి, కాంగ్రెసు పార్టీని టార్గెట్ చేయలేదన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తున్నానని అయినా తనకు న్యాయం జరగలేదన్నారు.


