TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'మీకు చెప్పేవిస్తరణ..విభేదాలున్నట్టు మీడియా సృష్టే'

Published on: Sat Dec 31, 2011 7:45AM

న్యూఢిల్లీ:ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన విశేషాలను మీడియాతో పంచుకున్నారు. రాష్ట్రానికి రావలసిన పెండింగ్ ప్రాజెక్టుల గురించి సంబంధిత మంత్రులతో చర్చించామన్నారు. అదేవిధంగా రాష్ట్రానికి రావలసిన వాటాపై అభ్యర్థించినట్లు చెప్పుకొచ్చారు.చిరంజీవి వర్గాన్ని మంత్రిమండలిలో చేర్చుకునేందుకే ఢిల్లీకి వచ్చారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ పార్టీకి సంబంధించి అనేక సమస్యలు, వ్యవహారాలు అంతర్గతంగా చర్చించుకుంటామన్నారు. అవన్నీ మీకు చెప్పేవి కాదని బదులిచ్చారు.  అవసరమైనప్పుడు రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. మీడియాకు చెప్పే విస్తరణ చేస్తామని ఆయన చెప్పారు.చిరంజీవితో అధిష్టానం మాట్లాడుతోందనీ, పైగా పీఆర్పీ విలీనం ఇంకా అసెంబ్లీలో జరుగలేదని అన్నారు. సభాపతి ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు ఆ కార్యక్రమం జరిగిపోతుందనీ, ఆ తర్వాత పార్టీపరంగా తీసుకోవలసినవి తీసుకుంటారన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో తనకు ఏలాంటి విభేదాలు లేవని ఆయన అన్నారు.  బొత్స, తాను కలిసే నిర్ణయాలు తీసుకుంటున్నామని, విభేదాలు ఉన్నట్లు మీడియా సృష్టేనని ఆయన అన్నారు.  జోడు పదవులపై పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఆయన అన్నారు. మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ  నివేదిక తనకు అందలేదని, అందగానే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా బొత్స విధులు బొత్స నిర్వహిస్తున్నారని, తన విధులు తాను నిర్వహిస్తున్నానని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర సమితి  అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు గడువులపై తాను స్పందించబోనని, అభివృద్ధే తమకు ముఖ్యమని ఆయన అన్నారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అపాయింట్‌మెంట్ కోసం చూస్తున్నట్లు ఆయన తెలిపారు.  విప్ ధిక్కరించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై అనర్హత వేటుపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ చూసుకుంటారని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో సంక్షేమ కార్యక్రమాలే తమ ప్రచారాస్త్రాలని ఆయన చెప్పారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శంకరరావు వ్యవహారంపై అధిష్టానమే చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగానే విద్యుత్తు చార్జీల పెంపు ఉంటుందని, అన్ని రాష్ట్రాలు పెంచుతున్నాయి కాబట్టి మన రాష్ట్రం కూడా పెంచాల్సి వస్తోందని, విద్యుత్తు చార్జీలు పెంచకుంటే కేంద్రం ఇచ్చే నిధుల్లో కోత పడుతుందని ఆయన చెప్పారు. ఎక్కడ అవసరమైతే అక్కడ పన్నులు పెరుగుతాయని, వాటికి అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడత మని ఆయన చెప్పారు. కేంద్రం ఆదేశాల మేరకే 1 శాతం వ్యాట్ పెంచామని ఆయన చెప్పారు. రక్షణ రంగానికి అవసరమైన భూములు కేటాయిస్తామని ఆయన చెప్పారు. లక్ష ఉద్యోగాల ప్రధానికి లేఖ రాశామని, భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని అయన  చెప్పారు. ఒప్పందంలోని సమస్యల వల్ల కొన్ని 108 వాహనాలు ఆగిపోయాయని ఆయన చెప్పారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం, కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటాయని మాత్రమే తాను చెప్పానని ఆయన అన్నారు.