హస్తినలో సీఎం బిజీ బిజీ
Published on: Fri Dec 30, 2011 2:30PM
న్యూ
ఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. హోంమంత్రి చిదరంబరంతో భేటీ అయిన ఆయన రాష్ట్రంలో శాంతిభద్రతలు, తెలంగాణ అంశాలపై చర్చించినట్టు సమాచారం. చిదంబరంతో సమావేశం అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ ఓరాను కలిశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను పురస్కరించుకుని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సేవల్ని కేంద్రం వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రామీణాభివృద్ధిమంత్రి జైరాం రమేష్ తో కూడా సమావేశమైన సీఎం ఆయనతో రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి చర్చలు జరిపినట్టు తెలిసింది. అక్కడ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ సీఎం నేదురుమల్లి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.


