ఇంతటి దుస్థితిలో ప్రభుత్వం ఉంది జగన్
Published on: Sat Dec 24, 2011 4:21PM
కడ
ప: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రైతు సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని ఆయన విమర్శించారు. అన్నదాతకు భరోసా ఇవ్వని ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపినా తప్పులేదని అన్నారు. శనివారం కడప జిల్లా మైదుకూరు మండలం కేశలింగాయపల్లి గ్రామంలో ఆయన ఉల్లి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో, లేదో అర్థంకాని పరిస్థితిలో రైతు ఉన్నాడని అన్నారు. పది నెలలు వ్యవసాయ శాఖకు మంత్రి లేడని, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్‌ను నియమించలేదని, ఇంతటి దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


