TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు.. 90 ఏళ్ల వృద్ధురాలితో భేటీ..!

Published on: Fri Aug 7, 2026 5:21PM

 

తనను ఒక్కసారి కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి కోరికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. చీరాల పర్యటన సందర్భంగా ఆమెను ఆప్యాయంగా పలకరించి, కలిసి ఫోటో దిగారు. ఇదే సందర్భంగా తన చిత్రపటాన్ని మగ్గంపై నేసిన చేనేత దంపతులను కూడా సీఎం అభినందించారు.

సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఫోటో దిగాలన్న కోరికను 90 ఏళ్ల పుష్పావతి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చీరాలలో ఆమెను ప్రత్యేకంగా కలుసుకుని, ఆప్యాయంగా పలకరించి ఫోటో దిగారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన చేనేత దంపతులు నాగేశ్వరరావు, లక్ష్మి మగ్గంపై నేసిన తన చిత్రపటాన్ని పరిశీలించిన సీఎం... వారి కళానైపుణ్యాన్ని అభినందించారు.

CM  Chandrababu, Andhra Pradesh Chief Minister, 90-year-old woman, Pushpavathi,
Elderly womans wish fulfilled, Emotional meeting, Special interaction